Vegetables are always good for health. But many people are afraid to eat vegetables during monsoons. The reason is the fear that the greens in the field during the rainy season will be high in bacteria.
Many people do not like to eat vegetables during monsoons for fear of infection. Even if the leaves are not infected, the risk of disease is high during the rainy season. In this season, people start getting cold, cough, jaundice, dysentery etc.
To reduce the risk of monsoon diseases, one should eat vegetables properly. So don't exclude vegetables from your diet.
Washing vegetables thoroughly and cooking them reduces the risk of infection. So learn the right way to clean vegetables. From buying vegetables to cooking, simple tips are good for health
Buy fresh vegetables from the market. Before buying the leaves of any vegetable check the stems..if they turn yellow..don't buy them if they have worms. Buy vegetables after careful consideration.
The vegetables brought from the market should be washed well. Special liquid soaps are available in the market for washing vegetables. You can wash vegetables with that soap. Or add turmeric and salt to the water to wash the vegetables and wash them thoroughly two or three times.
Another method can be used to wash vegetables. Soak in ice water for a while. Doing this will keep the vegetables fresh.
Vegetables should not be cooked directly after cleaning. Even after washing well, vegetables still contain germs. So first wash the vegetables with salt.. Boil them in water. Then immediately take out the vegetable water and then cook..
Telugu version
కూరగాయలు ఎప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ చాలా మంది వర్షాకాలంలో కూరగాయలు తినడానికి భయపడతారు. వర్షాకాలంలో పొలంలో ఉండే ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందన్న భయమే కారణం.
ఇన్‌ఫెక్షన్ భయంతో చాలా మంది వర్షాకాలంలో కూరగాయలు తినడానికి ఇష్టపడరు. ఆకులకు ఇన్ఫెక్షన్ సోకకపోయినా వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ప్రజలకు జలుబు, దగ్గు, కామెర్లు, విరేచనాలు మొదలవుతాయి.
వర్షాకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, కూరగాయలను సరిగ్గా తినాలి. కాబట్టి మీ ఆహారం నుండి కూరగాయలను మినహాయించవద్దు.
కూరగాయలను శుభ్రంగా కడిగి వాటిని వండటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి కూరగాయలను శుభ్రం చేయడానికి సరైన మార్గం తెలుసుకోండి. కూరగాయలు కొనడం నుంచి వంట చేసే వరకు సాధారణ చిట్కాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి
మార్కెట్ నుండి తాజా కూరగాయలు కొనండి. ఏదైనా కూరగాయ ఆకులను కొనుగోలు చేసే ముందు వాటి కాడలను పరిశీలించి.. పసుపు రంగులోకి మారితే.. పురుగులు ఉంటే వాటిని కొనకండి. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కూరగాయలను కొనండి.
మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను బాగా కడగాలి. కూరగాయలు కడగడానికి ప్రత్యేక లిక్విడ్ సబ్బులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ సబ్బుతో కూరగాయలను కడగవచ్చు. లేదా కూరగాయలు కడిగే నీటిలో పసుపు, ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
కూరగాయలు కడగడానికి మరొక పద్ధతిని ఉపయోగించవచ్చు. ఐస్ వాటర్‌లో కాసేపు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల కూరగాయలు తాజాగా ఉంటాయి.
కూరగాయలను శుభ్రం చేసిన తర్వాత నేరుగా ఉడికించకూడదు. బాగా కడిగిన తర్వాత కూడా కూరగాయలలో క్రిములు ఉంటాయి. కాబట్టి ముందుగా కూరగాయలను ఉప్పుతో కడిగి.. నీటిలో వేసి మరిగించాలి. వెంటనే కూరగాయల నీళ్లను తీసి ఉడికించాలి..