AP SSC ఫలితాలు 2025 విడుదల:
రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన AP SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23 బుధవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు ఆధికారిక వెబ్‌సైట్, TV9 తెలుగు వెబ్‌సైట్, మనమిత్ర వాట్సప్, లీప్ యాప్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
వాట్సప్ ద్వారా ఫలితం చూడాలంటే, 9552300009 నెంబర్‌కి ‘Hi’ అని మెసేజ్ చేయండి, తరువాత విద్యాసేవలు ఎంచుకుని, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే PDF ఫలితం వెంటనే వస్తుంది.
ఫలితాల్లో ముఖ్యాంశాలు:
-
మొత్తం ఉత్తీర్ణత శాతం: 81.14%
-
అమ్మాయిలు: 84.09%
-
అబ్బాయిలు: 78.31%
-
100% ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్: 1680
-
శూన్య ఉత్తీర్ణత గల స్కూల్స్: 19
-
అత్యధిక ఉత్తీర్ణత గల జిల్లా: పార్వతీపురం మన్యం (93.90%)
-
అతి తక్కువ ఉత్తీర్ణత గల జిల్లా: అల్లూరి సీతారామరాజు (47.64%)
ఈ సారి మొత్తం 6,19,275 రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఇంగ్లిష్ మీడియంకి చెందిన వారు 5,64,064, తెలుగు మీడియంకి చెందిన వారు 51,069 మంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి 9 లోపు మూల్యాంకనం పూర్తయి, ఫలితాలు వేగంగా విడుదలయ్యాయి.