వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియమాలను ఉల్లంఘించినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పార్టీ శిస్సు పరిరక్షణ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్నట్లు తెలిపింది.
గత సంవత్సరం నుంచి దువ్వాడ శ్రీనివాస్ వివాదాల్లోనూ నిలిచారు. డివ్వెల మాధురితో సంబంధం, పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు, ఇటీవల విద్యుత్ శాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఫోన్‌లో బెదిరించిన ఘటనలతో వార్తల్లో నిలిచారు.
ఇదే సమయంలో, పార్టీ కొంతమంది జిల్లాల అధ్యక్షులను మార్పు చేసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా, అలాగే కె.కె. రాజును విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా నియమించారని పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.