తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్‌లో చాన్సులు వస్తున్నాయంటున్న పూజా హెగ్డే
కన్నడ నటి పూజా హెగ్డే కు ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గినప్పటికీ, బాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కప్పుడు తెలుగు పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హోదా దక్కించుకున్న పూజా, ఆ తర్వాత అదే వేగంతో అవకాశాలు తగ్గిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.
ఇటీవల ఆమె తన సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ఓ నిజాయితీగల వ్యాఖ్య చేశారు. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 27 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నా, అది థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యకు సరిపోదని చెప్పింది.
“కొంతమంది సూపర్‌స్టార్స్‌కి 5 మిలియన్లకంటే తక్కువ ఫాలోవర్లు ఉంటారు. కానీ వాళ్ల సినిమాలను లక్షలాది మంది థియేటర్లలో చూస్తారు,” అని పూజా తెలిపారు.
ఆమె స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే — సోషల్ మీడియాలో ఫేమస్‌గా ఉండటం సినిమాలకు ప్రేక్షకులను తెస్తుందనే అనుకోవడం తప్పు. అనేక మంది ఆన్‌లైన్‌లో ఫాలో అవుతారని, వాళ్లు తప్పకుండా థియేటర్‌కు వస్తారనే అర్థం కాదు.