చిరంజీవి విశ్వంభర నుంచి మ్యూజికల్ అప్‌డేట్ – “రామ రామ” పాట ఏప్రిల్ 12న వస్తోంది
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర నుంచి పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం యొక్క మొదటి పాట “రామ రామ” ని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ పాట విడుదలకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చిరంజీవి పక్కన చిన్నారులు హనుమాన్ వేషధారణలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది బింబిసార దర్శకుడు వశిష్ట. సంగీతాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్. కీరవాణి అందిస్తున్నారు. హీరోయిన్‌గా త్రిషా నటిస్తున్నారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. గత దసరా సందర్భంగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో సినిమా విడుదల తేదీ కూడా వెల్లడించనున్నారు.