స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఎక్స్’ (ఇటీవలి ట్విట్టర్) వేదికపై కోటికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. అయితే కొంత కాలంగా ఆమె ఈ వేదికకు దూరంగా ఉంటూ, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి ఇతర ప్లాట్‌ఫామ్‌ల్లో మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తూ వచ్చింది.
అయితే తాజాగా సమంత మళ్లీ ఎక్స్ వేదికలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కం బ్యాక్‌పై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో సమంత నిర్మాతగా కూడా కొత్త ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే పేరుతో ఆమె స్వంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించింది. తన బ్యానర్ కింద తొలి సినిమా ‘శుభం’ను ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో నిర్మించింది.
ఈ హర్రర్ కామెడీ జానర్‌లో వస్తోన్న ‘శుభం’ సినిమా ఫస్ట్ లుక్‌ను సమంత స్వయంగా ఎక్స్ వేదికపై పోస్ట్ చేసింది. ఈ పోస్టుతో పాటు ఆమె రీ ఎంట్రీపై నెటిజన్లలో విశేష ఆసక్తి నెలకొంది.