English Version
Telangana RTC has provided a good opportunity for Srivari devotees going to Tirumala. At the time of reservation of bus ticket to Tirumala, the facility of booking darshan ticket is also provided. These services will come into effect from today (Friday). Devotees traveling from Telangana to Tirumala by bus no longer need to book a Darshan ticket separately. A facility has been provided to book Darshan tickets on the TSRTC website at the same time as booking bus tickets.
For this, an agreement was signed between TSRTC and TTD. The RTC officials requested the devotees going to Tirumala to use the opportunity. These services are available from Friday. 1000 darshan tickets are available every day. Officials said that tickets can be booked directly from Telangana RTC official website or any reservation counter. But tickets should be booked at least a week in advance. Officials expect this to increase RTC revenue.
Telugu Version
తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మంచి అవకాశాన్ని కల్పించింది. తిరుమలకు బస్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్న సమయంలోనే దర్శనం టికెట్టును కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సేవలు నేటి నుంచి (శుక్రవారం) అమల్లోకి రానున్నాయి. తెలంగాణ నుంచి తిరుమలకు బస్సులో వెళ్లే భక్తులు ఇకపై ప్రత్యేకంగా దర్శనం టికెట్టును బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దర్శన టికెట్లను బస్ టికెట్ చేసుకునే సమయంలోనే టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఇందుకుగాను టీఎస్‌ఆర్టీసీ, టీటీడీల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుమల వెళ్లే భక్తులు అ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. శుక్రవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీరోజూ 1000 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా, ఏదైనా రిజర్వేషన్ కౌంటర్‌లో నేరుగా టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే కనీసం వారం రోజుల ముందే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.