పసిడి ధరలు ఆకాశానికి చేరుతున్నాయి!
గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు భారీ మార్పులను ఎదుర్కొంటున్నాయి. 2014లో బంగారం ధర తగ్గడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కానీ ప్రస్తుతం బంగారం ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగా మారిపోయింది, అందుకే ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 1, 2025 న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా, ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,192 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.8,426 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.6,895 గా ఉంది. అలాగే, వెండి ధరలకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు (10 గ్రాములకు):
-
హైదరాబాద్: 22K – ₹84,260 | 24K – ₹91,920
-
విశాఖపట్నం, విజయవాడ: 22K – ₹84,260 | 24K – ₹91,920
-
ఢిల్లీ: 22K – ₹84,410 | 24K – ₹92,070
-
ముంబై: 22K – ₹84,260 | 24K – ₹91,920
-
చెన్నై: 22K – ₹83,410 | 24K – ₹90,990
-
బెంగళూరు: 22K – ₹84,260 | 24K – ₹91,920
వెండి ధరలు (1 Kg):
-
హైదరాబాద్: ₹1,12,900
-
విజయవాడ, విశాఖపట్నం: ₹1,14,100
-
ఢిల్లీ: ₹1,03,900
-
ముంబై: ₹1,03,900
-
బెంగళూరు: ₹1,03,900
-
చెన్నై: ₹1,12,900
ఈ ధరలు ఉదయం 8 గంటలలోపు నమోదైనవి. తాజా బంగారం, వెండి ధరల కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వండి.