ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం – పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్ 11 బోగీలు
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి గౌహటి వెళ్తున్న కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు (12251) 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కటక్ సమీపంలోని నెర్గుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద శనివారం ఉదయం 11:54 గంటలకు జరిగింది.
ప్రాణనష్టం లేదు – అధికారులు స్పష్టీకరణ
రైల్వే అధికారుల ప్రకారం, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే, రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తూర్పు కోస్ట్ రైల్వే సీపీఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ప్రమాద స్థలానికి సహాయ రైలు, అత్యవసర వైద్య సేవలు అందించామని తెలిపారు.
అధికారుల పరిశీలన – దర్యాప్తు కొనసాగుతోంది
ఈ ఘటనపై డిఆర్ఎం ఖుర్దా రోడ్, జిఎం, ఇసిఓఆర్ సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణం ఏమిటనేది దర్యాప్తులో తెలుస్తుంది. అంతేకాకుండా, దారి మళ్లించిన రైళ్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు
ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల మార్గాలను మళ్లించారు: