సెప్టెంబర్‌లోపు OG విడుదల తప్పనిసరి..!
ఓజి సినిమా విడుదలపై భారీ అనిశ్చితి నెలకొంది. అభిమానులు 2025లోనే విడుదల కష్టమే అని భావించినా, మేకర్స్‌కి సెప్టెంబర్‌లోపు రిలీజ్ తప్పనిసరి. కారణం – OTT డీల్! చాలా ముందే ఓటీటితో ఒప్పందం పూర్తయింది, కానీ ఇప్పుడు అదే సినిమా రిలీజ్ డేట్‌ను నిర్ణయించే స్థాయికి వచ్చేసింది. 2025లో విడుదలను ఆలస్యం చేస్తే, ఓటీటి డీల్ ప్రకారం సినిమా రేటు సగానికి తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా OTT సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ బిజీ.. OG షూటింగ్ పూర్తి చేయడమే కష్టం!
OG చిత్రీకరణకు మరో 14 రోజులు డేట్స్ ఇవ్వగానే షూటింగ్ పూర్తవుతుంది, కానీ ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతల్లో బిజీ అయిపోయారు. దీంతో 2025లో OG రాక కష్టమేనని ఫిక్స్ అయ్యారు అభిమానులు. మే 9న రానున్న హరిహర వీరమల్లుతోనే సరిపెట్టుకోవాల్సిందే అనుకున్నారు. కానీ OTT డీల్ కారణంగా OGను సెప్టెంబర్ లోపు విడుదల చేయాల్సిందే.
OG, హరిహర వీరమల్లు – మూడు నెలల గ్యాప్‌లో రెండు పవన్ సినిమాలు?
తాజా సమాచారం ప్రకారం, OG సెప్టెంబర్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మే లోపు షూటింగ్ పూర్తిచేసి, దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే, 3 నెలల గ్యాప్‌లోనే హరిహర వీరమల్లు, OG థియేటర్లలో సందడి చేయనున్నాయి. పవన్ అభిమానులకు ఇది ద్విగుణిత ఉత్సవమే!