Latest Updates

“ఫేక్ కలెక్షన్స్” ఆరోపణలపై నాగవంశి స్పందన – ఇది పూర్తిగా నిరాధారమని ఖండించిన నిర్మాత

సినిమాలపై నెగిటివ్ కామెంట్స్, పైరసీపై సినీ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా మ్యాడ్ స్కైర్ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలతో పాటు, పైరసీ ఎలా జరుగుతుందనే అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. సీక్వెల్ కాబట్టి సినిమా ఆడుతోందని కొందరు విమర్శలు చేస్తుండగా, కొత్త సినిమాలు పైరసీకి గురవడం నిర్మాతలకు పెద్ద సమస్యగా మారిందన్నారు.

సినీ ఇండస్ట్రీలో పైరసీ పెనుభూతంగా మారుతోంది. కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీకి గురవుతున్నాయి, ఇది నిర్మాతలకు ఆర్థికంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ స్పందిస్తూ, మ్యాడ్ 2 పైరసీ కాపీని చెక్ చేయగా, ఓవర్సీస్ కాపీ లీక్ అయినట్లు గుర్తించినట్టు వెల్లడించారు. కొన్ని దేశాల్లో సెన్సార్ కోసం పంపిన కాపీలు లీక్ అవుతున్నాయని, ఈ సమస్యను నివారించడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

పైరసీని అడ్డుకోవడానికి లూప్ హోల్స్ ట్రాక్ చేస్తున్నామని, ఈ విషయాన్ని ఎఫ్‌డీసీతో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని నాగవంశీ చెప్పారు. అదేవిధంగా, మ్యాడ్ 2 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే కలెక్షన్లను ఫేక్ అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరికైనా కలెక్షన్స్‌పై అనుమానం ఉంటే తన వద్ద చూపించగలనని, ఫేక్ కలెక్షన్స్ చెప్పానని నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం మ్యాడ్ 2 రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని తెలిపారు.

“ఇప్పుడు ఒక సినిమా తీసి, ప్రమోట్ చేసి, ఓటీటీలో అమ్మడం చాలా కష్టమవుతుంది. కోర్టు సినిమా బాగుంది కాబట్టే ప్రేక్షకులు చూశారు. పక్క సినిమా బాగలేకపోతే చూడలేదు. మ్యాడ్ స్కైర్ బాగుంది కాబట్టే ప్రేక్షకులు చూస్తున్నారు. రివ్యూలలో సెకండాఫ్ బాగలేదని రాశారు, కానీ నేను స్వయంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని చూశాను. రివ్యూలు రాసేవారికి ప్రేక్షకుల కంటే ఎక్కువ తెలుసా? కంటెంట్ లేని సినిమాలు హిట్ అవుతున్నాయని రాయొద్దు” అని నాగవంశీ అన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens