Latest Updates

కోర్ట్ ఓటీటీ: నాని బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

నాని బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ థియేటర్లలో దుమ్మురేపింది – ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘కోర్ట్’, ఒక ప్రేమకథతో పాటు కోర్టు డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష్ రోషన్, శివాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

చిన్న బడ్జెట్ తో వచ్చిన ‘కోర్ట్’ సినిమా సంచలన విజయం సాధించింది. నాని స్వయంగా నిర్మించడం, మొదటి నుంచే సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకురావడంతో పాటు, అతని “కోర్ట్ నచ్చకపోతే, నా హిట్ 3 సినిమాలను చూడకండి” అన్న మాటలు మరింత క్రేజ్ తెచ్చాయి. సినిమాకు వచ్చిన అంచనాలకు తగ్గట్టుగానే, విడుదలైన తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ లో నిర్మించబడిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 56 కోట్ల కలెక్షన్లు సాధించి, ఐదింతల లాభం తెచ్చుకుంది. ఇప్పటికీ థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి.

దర్శకుడు రామ్ జగదీశ్, ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీ, పోక్సో కేసు, కోర్టు డ్రామా వంటి అంశాలతో ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా శివాజీ మంగపతి పాత్రలో చేసిన అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఓటీటీ రిలీజ్ డేట్ & స్ట్రీమింగ్ వివరాలు
ఇప్పుడు ‘కోర్ట్’ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 11 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens