మంచు విష్ణు ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ – శివ బాలాజీ ఫస్ట్ లుక్ విడుదల
డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. మోహన్ బాబు అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తుండగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో కన్నప్ప టీం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది.
ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి కొత్త అప్‌డేట్ వస్తుండటం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో ఈ సోమవారం శివ బాలాజీ ‘కుమారదేవ శాస్త్రి’ పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో శివ బాలాజీ ఒక ముని వేషంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రభాస్ రుద్రుడిగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కనిపించే పోస్టర్లు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదలకు టీం సిద్ధమవుతోంది.
ఈ సినిమా ఏప్రిల్ 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!