Andhra Pradesh

కొడాలి నానికి ముంబయిలో గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది

కొడాలి నానికి ముంబయిలో గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది

మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చేరారు. పరీక్షల తర్వాత ఆయనకు గుండె సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు గుండె వాల్వ్స్‌లో సమస్యలు ఉన్నట్లు నిర్ధారించడంతో, వైద్యులు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు.

అయితే, మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయికి తరలించారు. ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. సర్జరీ సుమారు 10 గంటలపాటు సాగింది.

ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండనున్నారని సమాచారం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens