TSRTC has given good news to those traveling on the HyderabadVijayawada route a huge discount

The Vijayawada route is heavily trafficked. The organization has decided to provide 10 percent discount on super luxury and Rajdhani AC services with the intention of reducing their financial burden. This concession is applicable up to Vijayawada route. For example, if a passenger wants to travel from Hyderabad to Visakhapatnam on Rajdhani AC service, a 10 percent discount will be given on his ticket till Vijayawada.

 The discount will save Rs.40 to Rs.50 per passenger. Passengers should avail this concessional facility which is available till 30th of this month.” TSRTC Chairman, MLA Bajireddy Govardhan, Company MD VC Sajjanar, IPS said. They suggest to contact their official website www.tsrtconline.com for reservation.

He also reminded that TSRTC is providing concession to passengers who make advance reservations. He said that if advance booking is done between 31 to 44 days, 5 percent discount is given and if reservation is made between 45 to 60 days, 10 percent discount is provided. For complete details contact TSRTC call center numbers 040-69440000, 23450033.

Telugu version

విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. ఆయన టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. ఆ రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల ౩౦ వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ తెలిపారు. రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌  www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.

అలాగే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ రాయితీ కల్పిస్తోందని గుర్తు చేశారు. ౩1 నుంచి 44 రోజుల మధ్యలో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటే 5 శాతం, 45 నుంచి 60 రోజుల మధ్యలో రిజర్వేషన్‌ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్‌ నంబర్లు 040-69440000, 23450033 ను సంప్రదించాలన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens