TSRTC good news for passengers.

TSRTC has announced special discounts for passengers who make advance reservations. It is requested to avail special concessions and reach the destinations safely.

Telangana State Road Transport Corporation (TSRTC) has given good news to the passengers. It has announced special discounts for travelers who make advance reservations. 5 percent discount on the ticket if the reservation is made 31 days to 45 days in advance . It has announced a 10 percent discount if the ticket is booked 46 days to 60 days in advance.

 The Online Passenger Reservation System (OPRS) software has been updated accordingly. TSRTC has clarified that this discount is applicable for all services with advance reservation facility.

On the occasion of Sankranti festival, the company has increased the advance reservation from 30 days to 60 days. This facility is being provided till June this year. This facility has received good response from the passengers. They booked their tickets easily online without any hassle. TSRTC has announced these special concessions to be more accessible to passengers.

“There are a lot of auspicious events, weddings and festivals in the coming days. This decision has been taken to reduce the financial burden on the people. Passengers should take advantage of the concessions offered by TSRTC and patronize the organization. Safe and comfortable travel is possible only in RTC buses. Advance reservation system is getting good response. Adequate efforts are being made to further improve the transport services for the passengers," said TSRTC Chairman, MLA Bajireddy Govardhan, MD VC Sajjanar. They are requested to visit the official website   www.tsrtconline.in for advance reservation in TSRTC buses.

Telugu Version

ముందస్తుగా రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌యాణికుల‌కు టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక రాయితీలు ప్రకటింంచింది. ప్ర‌త్యేక రాయితీల‌ను ఉప‌యోగించుకుని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవాలని కోరింది.
ప్ర‌యాణికుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. ముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌యాణికుల‌కు ప్ర‌త్యేక రాయితీల‌ను ప్ర‌క‌టించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ఆన్‌లైన్ ప్యాసెంజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయం ఉన్న అన్ని స‌ర్వీస్‌ల‌కు ఈ రాయితీ వ‌ర్తిస్తుంద‌ని టీఎస్ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఈ స‌దుపాయానికి ప్ర‌యాణికుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

“రాబోయే రోజుల్లో శుభ‌కార్యాలు, పెళ్లిళ్లు, పండుగ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌జ‌లపై ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీల‌ను ప్ర‌యాణీకులు స‌ద్వినియోగం చేసుకుని సంస్థ‌ను ఆద‌రించాలి. సుర‌క్షిత, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం ఆర్టీసీ బ‌స్సుల్లోనే సాధ్యం. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ విధానానికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌యాణీకుల‌కు ర‌వాణా సేవ‌లను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి త‌గిన కృషి చేయ‌డం జ‌రుగుతోంది ” అని టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ గారు, ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్  www.tsrtconline.in ను సంద‌ర్శించాలని వారు కోరారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens