Heart health is strong with Hibiscus.. and abundant health benefits..

Hibiscus.. This is a common flower plant found in everyone's home. Hibiscus flowers look beautiful in different colors of red, white and yellow. These are especially used for the worship of God. It is also put in the head. Moreover... Hibiscus flowers and leaves are also used in scalp oil and shampoos . However, hibiscus is not only for beauty. Many studies show that this flower also has many benefits for human health. This flower belongs to the genus Malvaceae. Hibiscus is the first in reducing blood pressure. Its antioxidant properties protect us from many problems. Let's find out here..

According to a study published in the Journal of Nutrition, drinking hibiscus tea daily can reduce systolic blood pressure by up to 10 points. A study has shown that hibiscus tea is effective in reducing diastolic blood pressure. It reduces the pressure in the arteries. Flavonoids and other phytochemicals present in hibiscus flowers keep the heart healthy. Also.. Hibiscus lowers cholesterol levels. According to a study published in the Journal of Alternative and Complementary Medicine..

Hibiscus tea lowers total cholesterol levels by up to 22%. Hibiscus is rich in antioxidants. They prevent oxidation of LDL (bad) cholesterol. Reduces the risk of heart disease. Inflammation leads to heart disease. Hibiscus has anti-inflammatory properties. These help reduce the risk of heart disease.

Telugu version

మందారం.. అందరి ఇళ్లల్లో కనిపించే ఒక సాధారణ పూల మొక్క ఇది. ఎరుపు, తెలుపు, పసుపు వివిధ రంగుల్లో మందార పూలు అందంగా కనిపిస్తాయి. వీటిని ప్రత్యేకించి దేవుడి పూజకు ఉపయోగిస్తారు. తలలో కూడా పెట్టుకుంటారు. అంతేకాదు…తలకు పెట్టుకునే నూనెలో, షాంపూలలో కూడా మందార పువ్వును, మందార ఆకులను ఉపయోగిస్తారు. అయితే, మందారతో కేవలం అందానికి సౌందర్యానికి మాత్రమే కాదు.. ఈ పువ్వు మనిషి ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మాల్వేసీ జాతికి చెందిన ఈ పువ్వు.. రక్తపోటును తగ్గించటంలో మందార ముందుంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనల్ని ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ మందార టీ ని తాగితే సిస్టోలిక్ రక్తపోటు 10 పాయింట్ల వరకు తగ్గుతుంది. డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించడంలో మందార టీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది ధమనుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. మందారం పువ్వుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఇతర ఫైటోకెమికల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు.. మందారం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం..

మందార టీ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను 22% వరకు తగ్గిస్తుంది. మందారంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మంట గుండె జబ్బులకు దారితీస్తుంది. మందారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens