Leukemia is a type of cancer. It should be detected early and treated immediately. Leukemia is caused by overproduction of white blood cells in our body. It is more common in young children. Leukemia is caused by overproduction of white blood cells in the bodycomes If the number of white blood cells is higher than it should be, they reduce the production of red blood cells and platelets. They weaken our body by preventing us from producing enough red blood cells. Due to their weakening, the production of red blood cells decreases and tumors are formed not only in the blood cells but also in the bone marrow.
These lead to leukemia. Due to this the energy efficiency in the body decreases and the health deteriorates day by day. That is why it should be detected at the initial stage and treated on time. But what are the symptoms of leukemia? What kind of treatment is there..let's know here..
How is leukemia diagnosed? If we look at the unusual symptoms in children... initially there is a normal fever, runny nose and cough. But if they are more than two weeks you should be careful.
If the child has frequent injuries that do not heal quickly, and the bleeding continues profusely, one should be alert. A doctor should be consulted immediately. Infection, fever is a common symptom of all types of cancer in children and adults. If the child has persistent fever and the fever does not subside for a long time, tests should be done immediately.
Caution should be exercised if frequent or persistent cough or difficulty breathing occurs. Be careful if you have gum problems, body rash, rapid weight loss, swelling in any part of the body, joint pain, cramps, headache, extreme vomiting.
Telugu version
లుకేమియా అనేది ఒక రకమైన క్యాన్సర్. దీనిని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స చేయాలి. మన శరీరంలో తెల్లరక్తకణాలు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో తెల్లరక్తకణాలు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. తెల్లరక్తకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే అవి ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయకుండా నిరోధించడం ద్వారా అవి మన శరీరాన్ని బలహీనపరుస్తాయి. ఇవి బలహీనపడటం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోయి రక్తకణాల్లోనే కాకుండా బోన్ మ్యారోలో కూడా ట్యూమర్లు ఏర్పడతాయి. ఇవి లుకేమియాకు దారితీస్తాయి. దీని వల్ల శరీరంలో శక్తి సామర్థ్యం తగ్గి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుంది. అందుకే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స చేయాలి. అయితే లుకేమియా లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి చికిత్స ఉంటుంది..ఇక్కడ తెలుసుకుందాం..
లుకేమియా ఎలా నిర్ధారణ అవుతుంది? పిల్లలలో అసాధారణ లక్షణాలు ఎలా ఉంటాయనేది పరిశీలించినట్టయితే.. మొదట్లో సాధారణ జ్వరం, ముక్కు కారడం,దగ్గు ఉంటాయి. కానీ అవి రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి.
పిల్లలకి తరచూ గాయాలు తగిలినా, త్వరగా నయం కాకపోయినా, రక్తస్రావం విపరీతంగా కొనసాగితే, అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్, జ్వరం అనేది పిల్లలు, పెద్దలలో అన్ని రకాల క్యాన్సర్ల సాధారణ లక్షణం. పిల్లలకి నిరంతరం జ్వరం వచ్చి చాలా కాలం వరకు జ్వరం తగ్గకపోతే వెంటనే పరీక్షలు చేయించాలి. తరచుగా లేదా నిరంతర దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లయితే జాగ్రత్త వహించాలి. చిగుళ్ల సమస్యలు, శరీరంలో దద్దుర్లు, వేగంగా బరువు తగ్గడం, శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, తలనొప్పి, విపరీతమైన వాంతులు వంటివి ఉంటే జాగ్రత్తగా ఉండండి.