Nowadays many people are suffering from uric acid problem. The problem of uric acid arises due to the increase of impurities in the blood .
Its increase is called hyperuricemia in medical language. It is a condition of increased plasma uric acid. Excess uric acid increases the risk of gout, kidney stones and many other diseases.
Although there are many medical treatments for it, uric acid levels can be controlled with some home remedies besides medicines. Consuming betel leaves can reduce elevated uric acid levels. Betel leaves work very effectively in reducing uric acid levels.
According to a research.. betel leaf juice was given to some rats. In that test, the uric acid level in the rats decreased from 8.09mg/dl to 2.02mg/dl. Betel leaves are rich in anti-inflammatory compounds.
It greatly reduces discomfort and pain in the joints. Protects against many chronic debilitating diseases like Rheumatoid Arthritis, Osteoporosis etc.
Telugu version
ప్రస్తుత కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు పెరిగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తుతుంది. దీని పరిమాణం పెరగడాన్ని వైద్య భాషలో హైపర్‌యూరిసెమియా అంటారు. ఇది ప్లాస్మా యూరిక్ యాసిడ్ పెరిగే పరిస్థితి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు, అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
దీనికి వైద్యంలో అనేక చికిత్సలు ఉన్నప్పటికీ, ఔషధాలే కాకుండా కొన్ని ఇంటి నివారణల ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించవచ్చు. తమలపాకును తీసుకోవడం ద్వారా పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో తమలపాకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఒక పరిశోధన ప్రకారం.. తమలపాకు రసాన్ని కొన్ని ఎలుకలకు ఇవ్వడం జరిగింది. ఆ పరీక్షలో ఎలుకల్లో యూరిక్ యాసిడ్ స్థాయి 8.09mg/dl నుండి 2.02mg/dlకి తగ్గింది. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్లలో అసౌకర్యం, నొప్పిని బాగా తగ్గిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి మొదలైన అనేక దీర్ఘకాలిక బలహీనపరిచే అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.