పుష్ప 2: 'పుష్ప-2' ఫైనల్ వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. గత ఏడాది డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ హిట్‌గా నిలిచిందని మేకర్స్ తెలిపారు. విడుదలైన మొదటి రోజే రూ. 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి, ఇండియన్ సినిమాలలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మూడురోజుల్లోనే రూ. 500 కోట్లు దాటింది. ఆరు రోజుల్లోనే రూ. 1,000 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో, అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens