భారతదేశంలో అడుగుపెట్టిన ది హాలీవుడ్ రిపోర్టర్ – తొలి సంచిక కవర్‌పై అల్లు అర్జున్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరిట భారతదేశంలో విడుదల కానుంది. విశేషం ఏమిటంటే, ఈ మ్యాగజైన్ తొలి భారతీయ సంచికకు అల్లు అర్జున్ ముఖచిత్రంగా నిలిచారు.
"అల్లు అర్జున్: ది రూల్" అనే కవర్ స్టోరీలో ఆయన గొప్ప విజయాన్ని వివరించారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని పేర్కొంటూ, అల్లు అర్జున్‌ను "స్టార్ ఆఫ్ ఇండియా" అని అభివర్ణించింది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం వరల్డ్ వైడ్ ₹1,871 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పింది.