It is worrying that the cases of corona are increasing slowly like water under the carpet, but it is a mistake. The cases which have been silent for years are becoming active again. More than 11,000 corona cases have been registered in the country in a single day, which shows the severity of the cases. And the number of corona active cases is close to 50 thousand. 29 people have died due to Corona in 24 hours. An increase in the positivity rate of daily people has given some relief.
The situation is similar in Telugu state too. Daily corona cases are slowly increasing. Corona is spreading like water under the carpet in AP. The registration of 12 new cases in Eluru district is a bit worrying. As 30 corona cases were registered in just two days, the district started to panic. Corona is slowly booming in Telangana too.
Telugu version
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటే పొరపాటే మెల్లమెల్లగా చాపకింద నీరులా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు సైలంట్‌గా ఉన్న కేసులు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. దేశంలో ఒకే రోజు 11వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయంటే కేసుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అటు 50 వేలకు చేరువలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఉంది. ఇక 24 గంటల్లో కరోనాతో 29 మంది మృతి చెందారు. రోజూవారి పాజిటివిటీ రేటు పెరగడం కాస్త ఊరట లభించింది.
ఇక తెలుగురాష్ట్రాలోనూ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రోజువారీ కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఇక ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా. ఏలూరు జిల్లాలో కొత్తగా 12 కేసులు నమోదవ్వడం కాస్త ఆందోళణ కలిగిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 30 కరోనా కేసులు నమోదు అవ్వడంతో జిల్లాలో కలవరం మొదలైంది. ఇటు తెలంగాణలోనూ మెల్లగా విజృంభిస్తోంది కరోనా.