Corona fear has started again in Telangana. Positive cases are increasing day by day. Corona created a commotion in Gurukula School for welfare girls in Thorrur of Mahabubabad district. A total of 9 people in the school have been diagnosed positive. However.. in such a background.. Telangana government has taken a key decision. Officials have announced that booster doses will be given across the state from today (Wednesday). It is explained that 5 lakh doses have been prepared for this purpose.
Medical experts suggest to be vigilant in the face of increasing cases. Masks should be worn and hands should be sanitized. There is nothing to be afraid of, but they are saying to take precautions. There is fear especially in Badu. Positive cases are coming to light here and there. The present corona puts tension on the students and parents during the final exams. The officials of medical and education departments are suggesting to the parents not to send them to schools if they have symptoms.
Telugu version
తెలంగాణలో మళ్లీ కరోనా భయం స్టార్ట్ అయ్యింది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 9మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి(బుధవారం) నుంచి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇందు కోసం 5 లక్షల డోసులను సిద్ధం చేసినట్టు వివరించారు.
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు పెట్టుకోవాలి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. భయపడాల్సిన పనిలేదు కానీ.. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా బడుల్లో భయం నెలకుంది. అక్కడక్కడా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రజంట్ కరోనా టెన్షన్ పెడుతుంది. లక్షణాలు ఉంటే వారిని స్కూళ్లకు పంపవద్దని తల్లిదండ్రులకు.. వైద్య, విద్యా శాఖల అధికారులు సూచిస్తున్నారు.