Corona epidemic is not over.. Precautions must be followed.. Prime Minister Modi's suggestion..

Confusion has started with the increasing number of corona cases in the country. At this juncture, the Center also alerted the states and advised them to take measures to prevent covid. Apart from this, regular reviews are conducted with the state authorities. Recently, the number of cases has crossed two thousand mark in the last 24 hours. 2,151 cases were reported in the country yesterday. It is worrying that the number of cases is increasing after 5 months. In this order, Prime Minister Narendra Modi conducted a high-level review on the situation of Covid-19 and influenza in the country on Wednesday.

 After knowing many details on this occasion, he gave instructions to the authorities. In this meeting, PM Modi directed officials to increase genome sequencing of positive cases. If there is a new variant, it can be tracked, he said. In view of the increasing number of covid cases, it is advised to wear a mask. Patients, health professionals, Health workers should also wear masks in the hospital. Modi advised senior citizens and those suffering from illness to wear masks. Test-Track-Treat-Vaccination, It is very important to follow the rules of Covid.

Telugu version

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కలవరం మొదలైంది. ఈ తరుణంలో కేంద్రం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసి.. కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతోపాటు రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. తాజగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య రెండువేల మార్క్ దాటింది. దేశంలో నిన్న 2,151 కేసులు నమోదయ్యాయి. 5 నెలల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశంలో కోవిడ్ 19, ఇన్‌ఫ్లుఎంజా పరిస్థితిపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వివరాలు తెలుసుకుని.. అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో, పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్ ఉంటే, దానిని ట్రాక్ చేయవచ్చని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మాస్క్ ధరించాలని సూచించారు. రోగులు, ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా ఆసుపత్రిలో మాస్కులు ధరించాలన్నారు. సీనియర్‌ సిటిజన్‌లు, అనారోగ్యంతో బాధపడే వారు మాస్కులు ధరించాలని మోడీ సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమని.. తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens