tics Telangana

Kamal Nath special focus on Telangana New enthusiasm in BJP ranks with Amit Shah Chevella Sabha

Telangana BJP: Union Home Minister and BJP leader Amit Shah's tour of Telangana has filled the ranks of the saffron party. With the success of the Vijaya Sankalpa Sabha organized by the Telangana BJP in Chevella, the ranks of the BJP are indulging in new enthusiasm. The name of the assembly is the will to win.. That's why Amit Shah, living up to the name, said what he wanted to say directly. With that, every word that Amit Shah spoke in Chevella Vijaya Sankalpa Sabha exploded like a bullet. Amit Shah blasted punch dialogues against the KCR government while giving a victory speech to the saffron ranks.

 KCR and Parivar were targeted and questions were thrown. Amit Shah blasted punch dialogues against the KCR government while giving a victory speech to the saffron ranks. Shah said that the BRS government is mired in corruption. It is certain that KCR will be ousted in the next election. It is certain that BJP will come to power. Owaisi was also under fire. He said that the real steering of KCR is in the hands of Oyic. He promised to lift Muslim reservation as soon as BJP comes to power. Also, Amisha asked questions on the leak of TSPSC and Tenth Papers. Amit Shah lashed out at the KCR government saying, "Are you playing with the lives of the unemployed youth?"

At the same time, he gave a victory speech to the Telangana Kamal Dal. They were determined to win and win. Amit Shah also participated in the unscheduled meeting and made several suggestions to key BJP leaders. Amit Shah met with the chief leaders for 45 minutes at Novatel before the meeting. Shah held the main discussion as the target of the upcoming assembly elections.

 How is the state of the party? Where are the errors? What else is needed to come to power? They inquired. Amit Shah directed the leaders to reach out to the people more and expose the failures of the KCR government. Later, he reached the BJP Vijaya Sankalpa Sabha at Chevella KVR Ground and delivered a keynote speech. Meanwhile, the BJP successfully mobilized people for the Chevella Sabha.

Telugu version

Telangana BJP: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ టూర్.. కాషాయ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ బీజేపీ చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభ సక్సెస్ అవ్వడంతో బీజేపీ శ్రేణులు నూతన ఉత్సాహంలో మునిగితేలుతున్నారు. సభ పేరే విజయ సంకల్పం.. అందుకే పేరుకు తగ్గట్టే అమిత్‌షా సూటిగా చెప్పాలనుకున్నది చెప్పారు. దాంతో, చేవెళ్ల విజయ సంకల్ప సభలో అమిత్‌షా మాట్లాడిన ప్రతి మాటా ఒక్కో తూటాలా పేలింది. కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. కేసీఆర్‌ అండ్‌ పరివార్‌ టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు.

 కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. BRS ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు. ఓవైసీపైనా నిప్పులు చెరిగారు షా. అసలు కేసీఆర్‌ స్టీరింగే.. ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఇక, TSPSC, టెన్త్‌ పేపర్ల లీక్‌పైనా ప్రశ్నల వర్షం కురిపించారు అమిషా. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ.. అమిత్ షా కేసీఆర్‌ సర్కార్‌పై చెలరేగిపోయారు.

అదే టైమ్‌లో తెలంగాణ కమల దళానికి విజయోపదేశం చేశారు. గెలవాలి, గెలిచి తీరాలి అంటూ విజయ సంకల్పాన్ని నూరిపోశారు. షెడ్యూల్‌లో లేని మీటింగ్‌ లో కూడా అమిత్ షా పాల్గొని.. బీజేపీ కీలక నేతలకు పలు సూచనలు చేశారు. సభకు ముందు నోవాటెల్‌లో 45నిమిషాలపాటు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు అమిత్‌షా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా షా.. ప్రధాన చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలాగుంది?. ఎక్కడెక్కడ లోపాలున్నాయ్‌?. అధికారంలోకి రావాలంటే ఇంకా ఏమేం చేయాలి? అంటూ ఆరా తీశారు. మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్‌షా. అనంతరం చేవెళ్ల KVR గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు చేరుకుని కీలక ప్రసంగం చేశారు. కాగా, చేవెళ్ల సభ కోసం బీజేపీ భారీగా జనసమీకరణ చేపట్టి సక్సెస్ అయింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens