మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU), హైదరాబాద్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విధానంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూజీ, పీజీ, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశాలు హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌తో పాటు లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, అసన్‌సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్, బెంగళూరు, కటక్‌లో ఉన్న అనుబంధ కేంద్రాల్లో కూడా జరుగుతాయి. అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో ఉర్దూను మీడియంగా లేదా సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేకపోతే ఉర్దూ భాషకు తత్సమాన మదర్సా కోర్సులను ఉత్తీర్ణులై ఉండాలి. భాషా కోర్సులు మినహా అన్ని కోర్సులు పూర్తిగా ఉర్దూ మీడియంలోనే ఉంటాయి. ఈ కోర్సులలో ప్రవేశాలు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కల్పించబడతాయి. పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశ పరీక్ష ద్వారా పీహెచ్‌డీ కోర్సుల్లో ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. పీజీ కోర్సులుగా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, చివరి తేదీలు, పరీక్ష వివరాల గురించి పూర్తి సమాచారం అక్కడ పొందుపరిచే ఉంటుంది.
tics Telangana
MANUU ప్రవేశాలు 2025: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశ నోటిఫికేషన్ & ప్రవేశ పరీక్ష తేదీ
