Good news will be available to the people of AP within another week

Good news for people of AP. Another fast and comfortable Vande Bharat train will be available. Center has decided to run Vande Bharat between Vijayawada and Chennai. That too is never known. From the 7th of this month. Prime Minister will give virtual green signal to 5 Vande Bharat trains on July 7.

 Bejawada Railway Division has received information that Vijayawada-Chennai Vandebharat is also included in it. It is heard that the authorities there have started making arrangements. This train will be fully available from 8th.

What are the stops between Vijayawada and Chennai? Timings, ticket rates etc. details are likely to be revealed soon. It is reported that Vijayawada Division Railway officials have requested to run this train through Renigunta route.

 If that is the case, from Vijayawada to Guduru, Renigunta, Katpadi Gundu and going to Chennai, return will come on the same route. In view of the rush of passengers traveling between Vijayawada and Tirupati. An official announcement will come on the start of this train.

2 Vande Bharat trains are already running through Andhra. While one train is available on Secunderabad – Vizag route, another train is plying between Secunderabad – Tirupati. Now it is said that the 3rd train will come.

Telugu version

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. వేగవంతంగా, సౌకర్యవంతంగా నడిచే మరో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ నడపాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా ఎప్పుడో కాదండోయ్. ఈ నెల 7 నుంచేనట. ప్రధాని జులై 7న 5 వందే భారత్ ట్రైన్స్‌కు వర్చువల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అందులో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉందని బెజవాడ రెల్వే డివిజన్‌కు సమాచారం అందిందట. దీంతో అక్కడి అధికారులు ఏర్పాట్లు మొదలెట్టినట్లు వినికిడి. ఈ ట్రైన్ 8వ తారీఖు నుంచి కంప్లీట్‌గా అందుబాటులో ఉంటుందట.

విజయవాడ నుంచి చెన్నై మధ్య స్టాపులు ఏమేం ఉంటాయి. టైమింగ్స్ ఎలా ఉంటాయి, టిక్కెట్‌ రేట్లు.. తదితర  వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ రైలును రేణిగుంట మార్గం గుండా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అలా చూసుకుంటే విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి గుండూ చెన్నై వెళ్లి.. అదే రూటులో రిటన్ రానుంది.

 విజయవాడ-తిరుపతి మధ్య ప్రయాణించే పాసింజర్స్ రద్దీ నేపథ్యంలో.. ఈ వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ట్రైన్ ప్రారంభంపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రానుంది.

ఆంధ్రా మీదుగా ఇప్పటికే 2 వందే భారత్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి. సికింద్రాబాద్ – వైజాగ్ మార్గంలో ఒకటి అందుబాటులో ఉండగా.. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య మరో ట్రైన్ ప్రయాణిస్తోంది. ఇప్పుడు 3వ ట్రైన్ రానుందని చెబుతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens