The story of Suman, who accidentally got stuck between the rocks while swimming at the waterfall, ended in tragedy. Sumanth went on a fun outing with a friend and fell ill. Suman's body was recovered by the Erravaripalem police on Saturday morning. This incident which took place in Tirupati district on Friday (June 30) evening has created a commotion in the locality.
Sumanth, who is studying M.C. in Chennai, met with a fellow student from Tirupati and met with an accident. He asked his friend to take a video of him jumping from the top of the waterfall. In this sequence, Sumanth, who jumped into the water upside down from above, was not seen and the friend became worried.
Sumanth's friend immediately informed the police when he came to know that his head was stuck with stones. The Erravaripalem police reached the spot till Friday night and tried to get Sumanth out but to no avail. They said that it will be uncovered on Saturday morning as it gets dark.
The police recovered Sumanth's body this morning. But similar incidents often happen in Talakona. So far this year, the police have found that three youths have drowned in the falls.
Telugu version
జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్ కథ విషాదాంతమైంది. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమంత్ అశువులు బాశాడు. శనివారం ఉదయం ఎర్రవారిపాలేం పోలీసులు సుమన్ మృతదేహాన్ని వెలికితీశారు. తిరుపతి జిల్లాలో శుక్రవారం (జూన్ 30) సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చెన్నైలోని ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతం పై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు. ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు.
సుమంత్ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు.
ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.