పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు – కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని పార్టీ నేతలు తెలిపారు.
తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ, “పవన్ కల్యాణ్‌పై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు. ఆమె వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి,” అన్నారు. కవిత లిక్కర్ కేసులో జైలుకెళ్లిన విషయం గుర్తుచేస్తూ, అలా చేసిన వ్యక్తికి పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని హుచ్చారించారు.
ఈ వ్యాఖ్యలపై జనసేన సోషల్ మీడియా వేదికగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ అభిమానులు #ApologizeToPawan అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.