Not to mention the craze of Power Star Pawan Kalyan. Being busy with movies on one side and politics on the other, he has popularity all over the country. Powerstar's name is heard strongly in IPL as well. Recently Sunrisers Hyderabad caught the attention of Pawan Kalyan fans with a trendy post. The power star has added a photo of Captain Markram wearing an orange colored towel to her trademark red towel.
Added the crazy caption 'Fire storm is coming'. Sunrisers made the tweet ahead of their Tuesday night (April 19) match against Mumbai in Uppal. This post suddenly became viral on social media. While there is Hyderabad in the name, there is no single Telugu player in the Sunrisers team. That is why it is trying to impress the local fans. As part of this, RRR also used the Natu Natu song from the movie. Recently, she also shared a photo of Pawan Kalyan and tried to impress the local fans.
On the day of the SRH vs Mumbai match, Pawan entered the shooting set of 'OG' (working title). The hashtag 'Fire Storm is Coming' has been trending for this new movie directed by Saaho director Sujeeth. Now using the same tag, Sunrisers has tweeted comparing Markram with Pawan. It seems that Priyanka Arul Mohan is acting opposite Pawan in this movie. RRR producer DVV Danayya is producing this movie.
Telugu version
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఈక్రమంలో ఐపీఎల్లో కూడా పవర్‌స్టార్ పేరు గట్టిగా వినిపిస్తోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ట్రెండీ పోస్టుతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. పవర్ స్టార్ తన ట్రేడ్ మార్క్ ఎర్ర టవల్ వేసుకున్న ఫొటోకు, కెప్టెన్ మార్క్రమ్ ఆరెంజ్ కలర్ రుమాలు ధరించిన ఫొటోను జత చేసింది.
దీనికి ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అనే క్రేజీ క్యాప్షన్‌ను జోడించింది. ఉప్పల్‌లో మంగళవారం (ఏప్రిల్ 19) రాత్రి ముంబైతో మ్యాచ్‌కు ముందు ఈ ట్వీట్ వేసింది సన్‌రైజర్స్. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా పేరులో హైదరాబాద్ ఉన్నా సన్‌రైజర్స్ జట్టులో ఒక్క తెలుగు ప్లేయర్ లేకుండడంపై విమర్శలు వస్తున్నాయి. అందుకే స్థానిక అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను కూడా వాడేసింది. తాజాగా పవన్ కల్యాణ్ ఫొటోను కూడా షేర్ చేసి లోకల్ ఫ్యా్న్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
కాగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ రోజే.. పవన్ ‘ఓజీ’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ సెట్లో అడుగుపెట్టాడు. సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ కొత్త సినిమాకు మొదటి నుంచి ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు అదే ట్యాగ్‌ను వాడుకుని.. పవన్‌తో మార్క్రమ్కు పోలిక పెడుతూ ట్వీట్ చేసింది సన్‌రైజర్స్. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.