పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... యిది ఒకపేరు కాదు ఒక బ్రాండ్.. ఈ పేరంటే యువతీ యువకులకు ఒక శక్తి.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరో గా తెరంగేట్రం చేసి, నటనలో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకొని అంచలంచలుగా ఎదుగుతూ యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న సినీ మిస్సైల్ ఆయన..
పవన్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్.. పవన్ అంటే క్రేజ్ లో సునామీ.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా హీరోగా దూసుకుపోతూ రికార్డుల దుమ్ము దులిపిన రారాజు ఆయన.. సహనంలో ఆయన ధర్మ రాజు,దానగుణంలో ఆయన అపర కర్ణుడు.. ఆవేశంలో పరశు రాముడు..అప్పటి దాకా మూస ధోరణిలో వెళుతోన్న తెలుగు సినీ ఇండస్ట్రీకి న్యూ స్టైల్ ని పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్.. ఎందరో హీరోలు వారిలో పవన్ ది సెపరేట్ స్టైల్.. పవన్ కి ఉండేది సెపరేట్ క్రేజ్...
పవన్ అంటే ట్రెండ్ ని ఫాలో అయ్యేవాడు కాదు.. న్యూ ట్రెండ్ ని సెట్ చేసేవాడు అని ఇటు సినిమాలలోనూ, అటు రాజకీయాలోనూ నిరూపించుకొని సాక్షాత్తూ మనదేశ ప్రధాని చేతే పవన్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సునామీ అని పొగిడేలా చేసిన అకుంఠిత దీక్షా పరుడు మన కళ్యాణ్..
అన్న మెగాస్టార్ అయినా ఆయన స్టైల్ ని ఫాలో అవ్వకుండా సెపరేట్ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న మహోన్నత వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వ్యక్తిత్వలో వజ్ర సమానుడు.. పేదల్నిమరియు అభిమానుల్ని ఆదుకోవడంలో అభినవ దాన కర్ణుడు...
యిక పాలిటిక్స్ లో కి రాదలచి 2014 లో జనసేన పార్టీని స్థాపించి 2014లో టీడీపీబీజేపీలకు సపోర్ట్ చేసి, 2019 పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా ఓకే ఒక్క రాజోలు లో మాత్రమే పార్టీ సీటు గెలిచినా ప్రత్యర్థులుసూటుపోటు మాటలతో తూట్లు పొడిచినా, కార్లు మార్చినట్లు పెళ్లాలని మారుస్తాడంటూ కళ్ళు ఉన్న కబోదులు వేదికలపై రాళ్లు రువ్వినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్లా (21+2 ) గెలిచి 75 ఏళ్ళ రాజకీయ చరిత్ర లో ఎవరికీ సాధ్యం కాని 100% స్ట్రైక్ రేట్ ని సాధించి పాలిటిక్స్ లో కూడా న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేసి ఛాలెంజ్ చేసినట్టు గా ప్రత్యర్థి పార్టీని అధ:పాతాళంలోకి తొక్కి పారేసిన వామనుడు పవన్ కళ్యాణ్..
పవనుడి ప్రస్థానం గురించి యిలా చెప్పుకుంటూ పోతే రోజులు, పేజీలు చాలవు.. నేడు మా చిన్న బావ మరియు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీ ఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలని తెలియ జేస్తూ, త్వరలో ఆయనని ముఖ్యమంత్రి పీఠం పై చూడాలని కోరుకుంటూ...
మీ
మానే రామారావు
( సినీ కథా గేయ సంభాషణలు, పాటల రచయిత..)