7 సెకన్లలో గుండె జబ్బులు గుర్తించే యాప్ – చంద్రబాబు అభినందన
ఏఐ సాయంతో 7 సెకన్లలో గుండె జబ్బులను నిర్ధారించే 'స్కిరాడియావీ' యాప్‌ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల ఆవిష్కరణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ యాప్ ద్వారా రోగులకు పరీక్షలు నిర్వహించారు. బాలుడి ఆవిష్కరణపై ఆకర్షితులైన చంద్రబాబు, అతనికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు
సిద్ధార్థ్‌తో అరగంటపాటు ముచ్చటించిన చంద్రబాబు, అతడి ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించే ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఏఐలో మరిన్ని ప్రయోగాలు చేయాలని ప్రోత్సహించిన చంద్రబాబు, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాలుడిని అభినందించారు.