వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటానికి విజయ్ ముందుకు
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ వక్ఫ్ సవరణ చట్టం – 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్‌లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు కీలక చట్టంపై చొరవ చూపుతున్నారు.
ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం నేతలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా విజయ్ కూడా ఈ జాబితాలో చేరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న విచారణ చేపట్టనుంది.
మొదట ఈ కేసును ఏప్రిల్ 15న వినిచాలని భావించిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఏప్రిల్ 16కి మార్చింది. ఇప్పటికే పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. మరిన్ని కూడా ధర్మాసనం ముందుకు రానున్నాయి.