AP government is working hard to get rid of greedy people. Disha is working hard to save their lives through the app. However, some mahals continue to be affected by forest people. Recently, an atrocity came to light in Vemuru constituency of Bapatla district in AP. The driver raped the passenger in his auto. At around 10 o'clock on Wednesday night, a 35-year-old woman boarded an auto in Tenali to go to Christpuram in Kollur mandal. The driver, who took the auto into the fields at Moolapadu in the middle of the road, assaulted the woman.
The driver raped the woman and took 30,000 cash and ran away without taking the ring. The victim complained to the police. Kollur police have registered a case and are investigating. The case is being investigated from several angles. Are there any previous criminal charges against the accused..? They are inquiring whether there are any cases against him. The police say that steps will be taken to arrest the accused very soon. That is why officials suggest that women and young women should install Disha app on their mobile phones. It is said that women can get out of major accidents by pressing the Disha app button.
Telugu version
కామాంధుల బెండు తీసేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తుంది. దిశ యాప్ ద్వారా వారి మాన ప్రాణాలను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా కొందరు మహళలు.. అటవిక మనుషుల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలోని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో దారుణం వెలుగుచూసింది. తన ఆటో ఎక్కిన ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశారు. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో.. కొల్లూరు మండలం క్రీస్తుపురం వెళ్లేందుకు తెనాలిలో ఆటో ఎక్కింది 35 ఏళ్ల మహిళ. మార్గం మధ్యలో మూలపాడు వద్ద ఆటోను పొలాల్లోకి తీసుకెళ్ళిన డ్రైవర్.. ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మహిళాపై అత్యాచారం చేసి 30 వేలు నగదు తీసుకుని ఉంగారం లాక్కోని పరారయ్యాడు డ్రైవర్. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొల్లూరు పోలీసులు. కేసును పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడిపై గతంలో నేరారోపణలు ఏమైనా ఉన్నాయా..? అతడిపై ఏమైనా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అతి త్వరలో నిందితుడ్ని పట్టుకుని.. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అందుకే మహిళలు, యువతులు మొబైల్ ఫోన్లలో దిశ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మహిళలు దిశ యాప్ బటన్ నొక్కడం ద్వారా పెను ప్రమాదాల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.