సునామీ హెచ్చరిక
ఈ భూకంపం తర్వాత, US Tsunami Warning Center పాపువా న్యూగినియాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో విపత్కర సునామీ తరంగాలు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. NOAA (నేషనల్ ఓషనిక్ అండ్ అట్మోస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్) మరియు నేషనల్ వెదర్ సర్వీస్ కూడా సునామీ హెచ్చరికను ప్రకటించాయి.
ఆఫ్టర్‌షాక్ & తాజా పరిస్థితి
భూకంపం తరువాత సుమారు 30 నిమిషాల్లో అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో చిన్న భూకంపం (ఆఫ్టర్‌షాక్) కూడా నమోదైంది.
ప్రస్తుతం వరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం వివరాలు లేవు. పరిస్థితిని అధికారులు గమనిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆఫ్టర్‌షాక్స్కి సిద్ధంగా ఉండాలి.
మరిన్ని వివరాలు వచ్చిన వెంటనే అప్డేట్ చేయబడతాయి.