It has been almost four days.. Only dead bodies are seen by the crew who are removing the debris.
A dead body of a man was found sitting under the ruins of a building. Immediately, when the helpers removed the debris a little more, they saw a child in his lap.
Everyone thought that the child would also be dead. As everything was dark, the boy who had closed his eyes till then opened his eyes when the light came.
The support staff were shocked to see this. The child was immediately taken to the hospital. The father, who protected his son from falling debris, has left this world.
Watch this father's agony here. He was holding a small stone in his hand and making noise as he mourned for his family trapped under the rubble. He is screaming like a madman.
The family members who loved him so much are definitely alive.
The hope of surviving is what makes him do it. But no matter how much he screamed, no one answered him.. He was crying heartbroken.
Telugu version
దాదాపు నాలుగు రోజులు కావడంతో.. శిథిలాలను తొలగిస్తున్న సిబ్బందికి మృతదేహాలే కనిపిస్తున్నాయి.
ఓ భవనం శిథిలాల కింద కూర్చున్న స్థితిలో ఉన్న ఓ వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే సహాయక సిబ్బంది శిథిలాలను ఇంకొంచెం తొలగించి చూడగా.. అతడి ఒడిలో ఓ పిల్లాడు కనిపించాడు.
ఆ చిన్నారి కూడా చనిపోయి ఉంటాడని భావించారంతా. అంతా చీకటిగా ఉండటంతో అప్పటి వరకూ కళ్లు మూసుకొని ఉన్న ఆ బాబు.. వెలుతురు రావడంతో కళ్లు తెరిచాడు.
ఇది చూసిన సహాయక సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పిల్లాణ్ని హాస్పిటల్‌కు తరలించారు. తన కొడుకు మీద శిథిలాలు పడకుండా.. తన శరీరాన్నే రక్షణ కవచంలా మలచిన ఆ తండ్రి మాత్రం మాత్రం ఈ లోకం నుంచి వెళ్లిపోయారు.
ఇక్కడ ఈ తండ్రి పడే ఆవేదన చూడండి. శిథిలాల కింద చిక్కుకున్న తన కుటుంబం కోసం ఎంత పరితపిస్తున్నాడో.. చేతిలో చిన్న రాయి పట్టుకుని, శబ్దం చేస్తున్నాడు.
దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాడు. తనను ఎంతగానో ప్రేమించిన కుటుంబసభ్యులు ఖచ్చితంగా బతికే ఉన్నారు. ప్రాణాలతో బయటపడతారనే ఆశ అతనిని అలా చేయిస్తోంది. కానీ ఎంత అరిచినా ఎవరూ బదులు పలక్కపోవడంతో.. గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు.