50,000 for information on ganja smugglers 10,000 for information on ganja smokers

In Konaseema, which is known for its peaceful surroundings, the use of ganja and smuggling is also increasing, so the district administration has decided to seek the cooperation of the public. The district administration has announced a cash reward for those who provide information about the smuggling or use of ganja. Rs.50 thousand to those who give information about ganja smugglers, Rs. District Collector Himanshu Shukla and Superintendent of Police Sudhir Kumar Reddy said on Thursday that a reward of 10 thousand will be given.

The collector said that many youths, students and daily laborers are addicted to ganja and due to its influence, they indulge in anti-social activities. He expressed concern that the situation may turn dangerous if action is not taken as soon as possible. The details of those who gave information about cannabis will be kept confidential.

The SP said that the RTC officials have been informed about the smuggling of ganja through buses and have been asked to increase vigilance and this menace can be controlled only with the participation of the people.

Telugu version

 ప్రశాంతమైన పరిసరాలకు పేరుగాంచిన కోనసీమలో గంజాయి వినియోగంతో పాటు స్మగ్లింగ్‌ కూడా పెరుగుతుండడంతో ప్రజల సహకారం తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గంజాయి స్మగ్లింగ్ లేదా వినియోగం గురించి సమాచారం ఇచ్చిన వారికి జిల్లా యంత్రాంగం నగదు బహుమతిని ప్రకటించింది. గంజాయి స్మగ్లర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.50 వేలు, గంజాయి వినియోగంపై సమాచారం ఇచ్చిన వారికి రూ. 10 వేలు రివార్డు అందజేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ రెడ్డి గురువారం తెలిపారు.

అనేక మంది యువకులు, విద్యార్థులు, దినసరి కూలీలు గంజాయికి అలవాటు పడుతున్నారని, దీని ప్రభావంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కలెక్టర్ అన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి గురించి సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

బస్సుల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌పై ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించామని, నిఘా పెంచాలని కోరామని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ముప్పును నియంత్రించవచ్చని ఎస్పీ తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens