YSP ministers have crossed the limits They should apologize to the people of Telangana Pawan Kalyan

Janasena President Pawan Kalyan reacted to the exchange of words between Telangana Minister Harish Rao and AP Ministers. The Jana Sena chief expressed his anger over Minister Harish Rao's comments on Andhra Pradesh. 'The rulers are different... the people are different. People have nothing to do with the comments made by the leaders. This also applies to Telangana leaders and AP ministers.

 Minister Harish Rao spoke on AP but after that he spoke as if the YCP mantras were in his mouth. AP leaders should speak personally if Harish Rao's comments hurt them. Moreover, cursing Telangana people, criticizing Telangana region is not right. I am heartbroken that the YCP ministers are talking out of control so that the self-esteem of Telangana will be hit.

The CM should respond to the comments of AP ministers. Also YCP seniors should respond to these developments. AP ministers and leaders have businesses in Telangana. Leaders like Botsa used to run cable businesses in Telangana. YCP ministers should keep their mouth under control. Don't drag people into your disputes. Pawan demanded that the YCP ministers who spoke to damage the self-respect of the people of Telangana should apologize immediately.

Telugu version

తెలంగాణ మంత్రి హరీశ్ రావు – ఏపీ మంత్రుల మధ్య జరిగిన మాటల తూటాలపై జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాన్‌ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ పై మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోయారని జనసేన చీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు వేరు.. ప్రజలు వేరు. నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదు. ఇది తెలంగాణ నాయకులు, ఏపీ మంత్రులకు కూడా వర్తిస్తుంది. మంత్రి హరీశ్‌ రావు ఏ సందర్భంలో ఏపీపై మాట్లాడోగారో కానీ.. ఆ తర్వాత వైసీపీ మంత్రలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. హరీశ్‌ రావు వ్యాఖ్యలు బాధ కలిగిస్తే ఏపీ నేతలు వ్యక్తిగతంగానే మాట్లాడాలి. అంతేకానీ తెలంగాణ ప్రజలను తిట్టడం.. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడడం నాకు మనస్థాపం కలిగించింది

 ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి. అలాగే ఈ పరిణామాలపై వైసీపీ సీనియర్లు స్పందించాలి. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలున్నాయి. బొత్సా లాంటి నాయకులు మొన్నటి వరకు తెలంగాణలో కేబుల్ బిజినెస్‌లు చేశారు. వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ వివాదాల్లోకి ప్రజలను లాగద్దు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీనేలా మాట్లాడిన వైసీపీ మంత్రులు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని పవన్‌ డిమాండ్‌ చేశారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens