సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం – పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకునే సమయానికి పవన్ అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే, ఇచ్చిన మాట కోసం పర్యటన పూర్తిచేసి వెళ్లతానని ఆయన చెప్పారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్
సాయంత్రం పర్యటన పూర్తిచేసిన పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుని, కుమారుడి పరిస్థితిపై తొలిసారిగా స్పందించారు. ప్రమాదం చిన్నదే అనుకున్నానని, కానీ తర్వాత విషయం తీవ్రంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. మార్క్‌ను ఆసుపత్రిలో చేర్పించారని, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందని, బ్రాంకోస్కోపీ చేస్తున్నారని తెలిపారు.
ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్
మా అబ్బాయితో పాటు కూర్చున్న క్లాస్‌మేట్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని, చిన్న పిల్లలలో ఒకరు మృతిచెందిన వార్త తెలిసి బాధ కలిగిందన్నారు. ఈ ప్రమాదం వేసవి క్యాంప్ సందర్భంగా జరిగిందని, ఇది దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనపై తన తీవ్ర విచారాన్ని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.