మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపాటు – ఆసుపత్రి ఫొటో వైరల్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. అతనికి చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు ఇబ్బందిగా మారింది.
ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని సమాచారం. పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లెజ్నోవా ఆయనతో పాటు ఆసుపత్రిలో ఉన్నారు.
ఇక ఇటీవలే ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్‌కు సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో మార్క్ శంకర్ సురక్షితంగా ఉన్నట్టు కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.