పవన్ కళ్యాణ్ కుమారుడు గాయాలపాలయ్యారు – సింగపూర్‌లో చికిత్స
పవర్ స్టార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. మార్క్ చదువుకుంటున్న స్కూల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అతనికి చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అలాగే పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, ఇప్పటికే అరకు ఏజెన్సీలో పర్యటనలో ఉన్న ఆయన, కురిడి గ్రామంకి వెళ్లి గిరిజనులతో మాట్లాడతానని నిన్న ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నట్లు తెలిపారు.