In various regions within the city, administrative officials have declared a blockade for a period of two days due to maintenance work on the water supply system. From 6 am on the 19th of this month until 6 pm on the 20th, water supply will be suspended. Some areas within the jurisdiction of the Water Board divisions are facing partial disruption of water supply, while in other areas, the supply has been completely halted. The Water Board has reported leaks in the main pipeline as the cause of the disruption. Consequently, repairs are being carried out on the pumping main pipeline from Mirmur to Bommakal in the Godavari main pipeline network. As a result, a hindrance in the water supply is expected in the following areas for a period of two days: Greater Hyderabad limits, including the regions mentioned below.
Regions experiencing partial disruption of water supply
Erragadda, Ameerpet, Ellareddy Guda, Yousufguda, KPHB, Malaysian Town Ship Reservoir, Lingampalli to Kondapur, Gopal Nagar, Mayurinagar, Pragathinagar, Nizampet, Bachupalli
Regions experiencing complete halt in water supply
Kukatpally Division, Allamma Band, Alwal Reservoir, Kutbullapur Division, Chintal, Jeedimetla, Vani Chemicals, Jagadgirigutta, Gajularamaram, Suraram, Malkajgiri Paride Sainikpuri, Defence Colony, Kapra Municipality Sai Baba Nagar, Radhik, Mahesh Nagar, Out Reservoir
Nagar, Dammaiguda, Rampally, Keesar, Bollaram, Kompalli, Gudlapochampally, Tumkunta, Jawaharnagar, Devaryanjal, Hakimpet, Pragathinagar, Gajwel, Aleiru, Shamirpet, Medchal, Cantonment areas, and certain regions in Turkapalli Biotech Park are completely without water supply. Officials have informed that they are working on restoring the water supply as soon as possible.
Telugu Version
నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తాగు నీటి సరఫరా బంద్ చేస్తున్నారు. వాటర్ బోర్డు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. గోదావరి మెయిన్ పైప్లైన్ లీకేజీ కారణంగా వాటర్ బోర్డు రిపేర్లు చేపట్టనుంది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న పంపింగ్ మెయిన్ పైపులైన్ లీకేజీలను అడ్డుకట్ట వేసేందుకు రిపేర్ పనులు చేస్తున్నారు. అందువల్లనే రెండు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు.
నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలిగే ప్రాంతాలివే..
బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్ బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్, మయూరినగర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి
పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..
కూకట్ పల్లి డివిజన్ ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్, కుత్బుల్లాపూర్ డివిజన్షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి పరిధి సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, కాప్రా మున్సిపాలిటీలోని సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, నాగారం, దమ్మాయిగూడ , రాంపల్లి,కీసర ,బొల్లారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, ఆలేరు, శామీర్పేట, మేడ్చల్, కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా ఉండదని చెప్పారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.