IPL 2025: హైదరాబాద్‌ను వదిలిపెట్టనుందా సన్‌రైజర్స్? SRH vs HCA వివాదంపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హోమ్ గ్రౌండ్ గండం?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) - హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య ఫ్రీ పాస్‌ల వివాదం పెద్దదిగా మారింది. SRH తమ హోమ్ మ్యాచ్‌లను మరో నగరానికి మార్చే అవకాశముందని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. HCA నుంచి ఒత్తిడి పెరిగిందని ఆరోపణలు వస్తుండగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతోంది.
SRH vs HCA వివాదం ఏమిటి?
గత రెండేళ్లుగా SRH - HCA మధ్య ఫ్రీ టికెట్ల విషయంలో వివాదం నడుస్తోంది. SRH ఆరోపణల ప్రకారం, HCA అదనపు ఉచిత టికెట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతోందని చెబుతోంది. మార్చి 27న కూడా ఇలాంటి ఘర్షణ జరిగిందని, HCA ఒక కార్పొరేట్ బాక్స్ తాళం వేసి, అదనపు టికెట్లు ఇస్తేనే తెరవబోతామని చెప్పిందని SRH తెలిపింది.
ఇలాంటి సమస్యలు ఇంకా కొనసాగితే, SRH హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌ను వదిలేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు HCAకి మెయిల్ కూడా పంపింది. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం, BCCI దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని కూడా SRH ప్రకటించింది.
కానీ, HCA మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. SRH నుంచి ఎటువంటి అధికారిక మెయిల్ రాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న అన్నీ అబద్ధపు ప్రచారమని చెబుతోంది. అయితే, SRH యొక్క లీకైన మెయిల్ వాస్తవమా? లేక SRH హుకుంతో HCAపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
SRH వేరే నగరానికి వెళ్తుందా?
SRH ఆరోపణలు నిజమైతే, HCA వ్యవహారం హైదరాబాద్ ఇమేజ్‌కి గండి పెట్టే ప్రమాదం ఉంది. IPL జట్టును కోల్పోవడం అంటే తెలంగాణ ప్రభుత్వానికి, HCAకి కూడా పెద్ద సమస్యే. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా పేరుపొందడానికి ఇది పెద్ద షాక్.
BCCI జోక్యం చేసుకుంటే, HCAపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే SRHకి తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని HCAకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. HCA పై వచ్చే ఆరోపణలను విచారించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
ఈ వివాదం హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు కలవరపరిచే విషయం. మరి ఈ సమస్య ఒప్పందంతో పరిష్కారమవుతుందా? లేక SRH వేరే నగరానికి మారుతుందా? వేచి చూడాలి.