రతన్ టాటా జీవితాంతం దానం కోసం
భారతదేశం లో పేరెన్నికగల పారిశ్రామికవేత్త రతన్ టాటా 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన వీలునామాలో, దాదాపు రూ.10,000 కోట్ల విలువైన ఆస్తిని పేదల సహాయం కోసం ఒక NGOకి విరాళంగా ఇచ్చారు. మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.3,800 కోట్లు.
సేవకులకు, కుక్కకు ప్రత్యేక బహుమతులు
తన వంటవాడు రాజన్ షాకు ₹1 కోటి, ₹51 లక్షల అప్పును మాఫీ చేశారు. అతనికి తన పెంపుడు కుక్క టిటోను చూసుకోవాలంటూ బాధ్యత ఇచ్చారు. దానికి ₹12 లక్షలు కేటాయించారు. డ్రైవర్ రాజుకు ₹1.5 లక్షలు మరియు ₹18 లక్షల అప్పు మాఫీ చేశారు. ఇంట్లో పని చేసే వారు సేవా సంవత్సరాల ఆధారంగా ₹15 లక్షలు పొందనున్నారు.
అతని మానవతా మనసు ప్రతిబింబం
టాటా బ్రాండ్ దుస్తులను (డాక్స్, పోలో, బ్రూక్స్ బ్రదర్స్, హెర్మ్స్ టైలు) పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. సన్నిహితుడు శంతను నాయుడుకు ₹1 కోటి విద్యార్ధి అప్పు మాఫీ చేశారు. పొరుగువాడి ₹23.7 లక్షల అప్పు కూడా మాఫీ చేశారు. వీలునామా అమలు చేసిన వారికి ఒక్కోరికి ₹5 లక్షల బహుమతి ఇచ్చారు. సవతి సోదరీమణులు షిరిన్, డయానాలకు ఆస్తిలో మూడవ వంతు ఇచ్చారు.