International

డొనాల్డ్ ట్రంప్: న్యాయస్థానంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. అధ్యక్షుడి ఆదేశాలు నిలిపివేత

న్యాయస్థానంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ: అధ్యక్షుడి ఆదేశాలు నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ తన రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు. అలాగే, అమెరికా మిలటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ పలువురు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.

తాజాగా, న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ, ట్రాన్స్‌జెండర్లపై ట్రంప్ ఆదేశాలను తిరస్కరించింది. రాజ్యాంగంలోని ట్రాన్స్‌జెండర్ల హక్కులను భంగం చేసేలా నిర్ణయాలు తీసుకోవడాన్ని, న్యాయస్థానం సమర్థించలేదు. "అమెరికా స్వాతంత్ర్య ప్రకటన"లో మానవులందరూ సమానమేనని కోర్టు గుర్తుచేసింది.

ఈ సమయంలో, ట్రంప్ ఆదేశాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

మరొక పిటిషన్‌పై కూడా నిన్న విచారణ జరిగింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) మూసివేతపై కోర్టు విచారణ చేసింది. యూఎస్ ఎయిడ్ మూసివేతను వెంటనే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens