సునీతా విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలని, ఆమెకు సాటి ఎవరూ లేరని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. రోదసిలో 9 నెలలు గడిపిన అనంతరం సునీత, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు ఈ తెల్లవారుజామున భూమిని చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు స్వాగతం చెప్పిన చిరంజీవి.. ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. 8 రోజుల్లో తిరిగి వస్తామని 286 రోజుల తర్వాత భూమిని చేరుకున్నారన్నారు. ఆశ్చర్యకరంగా భూమి చుట్టూ 4,577 సార్లు తిరిగారని గుర్తు చేశారు. మీరు గొప్ప ధైర్యవంతులని, మీకు ఎవరూ సాటిరారని ప్రశంసించారు. సునీత ప్రయాణం ఒక అడ్వెంచర్ మూవీని తలపిస్తోందని, ఇదొక గొప్ప సాహసమని, నిజమైన బ్లాక్ బస్టర్ అని చిరు రాసుకొచ్చారు.