Major parties are making massive arrangements for the Vangaveeti Ranga Jayanti celebrations today

Vangaveeti Mohana Ranga.. Alias Ranga.. There are no people who do not know this name in Telugu states. Even if he worked as an MLA only once, it can be said that he created a stir in the politics of Andhra Pradesh. That is why even after 35 years of his death, Ranga's name is still reverberating in AP.

 Especially at the time of elections, political parties try to claim Ranga as their own by thinking of his name. But this time it can be said that Vangaveeti Ranga Jayanti is very special. Because.. there is not even another year for assembly elections in AP. Apart from that, it is being spread that the cops are going to play a decisive role in the elections this time.

In this order, the main parties have prepared the ground for organizing Ranga Jayanti programs on a large scale across AP. Along with TDP and Janasena, YCP is also going to organize Ranga Jayanti on a grand scale. Besides.. BJP is also thinking about the field. Arrangements were made for Ranga Jayanti celebrations at Tummalapalli Kala Kshetra, Vijayawada under the auspices of YCP. Besides.. Jana Sena says that all castes are equal, but there is a talk that the cops have almost owned the party.

Along with the increasing demand for the Kapus to take over the state power this time, there are possibilities of platforming the Ranga Jayanti celebrations. On the other hand.. Key Kapu leaders are in TDP. With that.. it seems that on behalf of the Telugu Desam Party, an action has been taken to organize the Ranga Jayanti celebrations. Overall.. Ranga Jayanti celebrations in AP are not political.

Telugu version

వంగవీటి మోహన రంగా.. ఆలియస్‌ రంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్లుండరు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు. అందుకే ఆయన చనిపోయి 35 ఏళ్ళు గడచినా రంగా పేరు మాత్రం ఏపీలో మారుమోగుతూనే ఉంది.

 ముఖ్యంగా ఎన్నికల వేళ ఆయన పేరు తలచుకుంటూ రాజకీయ పార్టీలు రంగాను తమ వాడిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈసారి అయితే వంగవీటి రంగా జయంతి మరీ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది కూడా వ్యవధి లేదు. దాంతోపాటు ఈసారి ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన భూమికను పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే.. ఏపీ వ్యాప్తంగా రంగా జయంతి కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాయి ప్రధాన పార్టీలు. టీడీపీ, జనసేనతోపాటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున రంగా జయంతిని నిర్వహించబోతోంది. అటు.. బీజేపీ కూడా రంగాను తలచుకుంటోంది. వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రంగా జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అటు.. జనసేన తమకు అన్ని కులాలు సమానమేనని చెబుతున్నా కాపులు ఆ పార్టీని దాదాపుగా ఓన్ చేసుకున్నారనే టాక్ ఉంది.

కాపులు ఈసారి రాజ్యాధికారాన్ని చేపట్టాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతుండటంతో పాటు, దానికి.. రంగా జయంతి వేడుకలను ప్లాట్‌ఫామ్‌ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. కీలకమైన కాపు నేతలు టీడీపీలోనే ఉన్నారు. దాంతో.. తెలుగుదేశం పార్టీ తరపున కూడా రంగా జయంతి వేడుకలు గట్టిగానే నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తంగా.. రంగా జయంతి వేడుకలు ఏపీలో రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens