Key instructions of the board on the disclosure of the results of the inter in two to three days

Inter Board Secretary Naveen Mittal issued key instructions to the officials on Wednesday regarding the announcement of Telangana Inter results. He ordered to reveal the inter results this time without any mistakes and problems. Inter board is doing a special exercise for this. In the background of the final stage of the result declaration process, spot valuation, codification of marks, de-coding process and online registration of marks were discussed. He said that every year many problems are faced in the examination and result declaration and this time the students should not face any problem in the inter examination. Do not hesitate to take some time if necessary for the declaration of results. Mittal advised the officials to proceed only after checking at all levels.

However, many mistakes have been made in online feeding in the past. They want to review why there were problems in the registration of marks in the past and formulate a procedure for the disclosure of the inter results. This year 9 lakh students appeared for the inter exams. Officers have been appointed for special scrutiny in the matter of registration of these marks. Finally, the board plans to prepare for the declaration of results after a thorough examination of everything. Sources of the board said that the date of declaration of results can be officially announced in another three to four days. As announced earlier, preparations are being made to declare the results by the second week of May.

telugu version

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ బుధవారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఆదేశించారు. దీనికోసం ఇంటర్‌ బోర్డు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్పాట్‌ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్‌ ప్రక్రియ, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు. ప్రతీ సంవత్సరం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈసారి ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అన్నారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దన్నారు. అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్‌ సూచించారు.

కాగా ఆన్‌లైన్‌ ఫీడింగ్‌లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయో సమీక్షించి ఇంటర్‌ ఫలితాల వెల్లడికి కార్యచరణ రూపొందించాలన్నారు. ఇక ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే యోచనలో బోర్డు ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ముందుగా ప్రకటించిన విధంగానే మే రెండో వారం నాటికే ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens