The farmers are ready to give an unprecedented welcome to the Chief Minister who is coming to Tenali for the first time as Chief Minister. This morning the button will be pressed and credited to the farmer's account. Looking at the schedule, CM Jagan will reach the helipad from Tadepalli residence at 9:50 in the morning. Take off from Tadepalli by helicopter at 10 am and reach Kavirajanagar at Patimbavukalla. After talking to the public representatives of Tenali.. from there they will reach the premises of the local agricultural market yard. Then the public meeting will be reached at quarter thirty five.
Visit the various stalls set up here and take photos with the beneficiaries. The fourth year and the third installment of YSR Rythu Bharosa CM Kisan Input Subsidy will be distributed to the farmers between 1035 and 1200. At 12 hours 20 minutes they will reach the helipad and leave. There they meet with the local leaders for fifteen minutes and at twelve thirty they return to Tadepalli by helicopter.
Telugu version
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తెనాలికి వస్తున్న ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈరోజు ఉదయం బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇక షెడ్యూల్ ఎలా ఉందని చూస్తే.. ఉదయం 9 గంటల 50 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుండి హేలిపాడ్ కు చేరుకుంటారు సీఎం జగన్. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో 10 గంటలకు బయలుదేరి పదింబావుకల్లా కవిరాజనగర్ చేరుకుంటారు. తెనాలి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి.. అక్కడి నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆపై బహిరంగ సభకు పదీ ముప్పైఐదుకు రీచ్ అవుతారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ సందర్శించి లబ్ధిదారులతో ఫోటోలు దిగుతారు. పదిముప్పావు నుంచి పన్నెండుంబావు మధ్య రైతులకు నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్సార్ రైతు భరోసా సీఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేస్తారు. 12గంటల 20 నిమిషాలకు హెలిపాడ్ కి చేరుకుని బయలుదేరి వెళతారు. అక్కడ పదిహేను నిమిషాల పాటు స్థానిక నేతలతో ముచ్చటించి పన్నెండుముప్పావుకు హెలికాప్టర్లో తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.