Abolish the vote in Andhra You are our children Minister Harish Rao's sensational comments

Ask the people there about the condition of roads and hospitals in Andhra Pradesh. Also, don't you go there from time to time? Look at the difference between there and here. Everyone who is shedding sweat for the development of Telangana is a child of Telangana. Vote in one direction. Minister Harish Rao made interesting comments saying 'keep it in Telangana'. Harish Rao's comments gained importance in the context of the spate of words between the ministers of the two states over the steel plant bidding.

 These comments were made by the Minister who laid the foundation stone for the construction of the Masonry Association building in Sangareddy. He said that CM KCR will give good news to the workers on May Day. Labor buildings will be constructed at a cost of Rs.2 crore in all the districts of the state. The foundation stone will be laid on May Day. Minister Harish suggested that everyone should take membership in the Construction Labor Council so that everyone can get the benefits.

Along with AP, many people from other states came and settled in Telangana. Besides, the workers who came and settled in Telangana know very well how the administration is in Andhra Pradesh. There is as much difference between there and here as there is between the earth and the sky (Zameen Asman Faraq). AP, Telangana... you will see these two areas directly.

 And you always go there, don't you? They will see the condition of the roads and hospitals there. Why should you vote there? Bandh there and register to vote here. You are also our people. Everyone who supports the development of Telangana is a child of Telangana. So people of Andhra should register their vote in Telangana itself' said Harish Rao.

Telugu version

‘ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిపై అక్కడున్న వాళ్లను అడగండి. అలాగే మీరూ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు కదా.. అక్కడికీ, ఇక్కడికీ తేడా చూడండి. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. ఒక దిక్కే ఓటూ పెట్టుకోండి. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి’ అంటూ మంత్రి హరీశ్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌పై ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో హరీశ్‌ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు మేడే రోజున సీఎం కేసీఆర్‌ శుభవార్త వినిపిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామన్నారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని  మంత్రి హరీశ్ సూచించారు.

‘ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు ఎంతో మంది వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసు. అక్కడికీ.. ఇక్కడికీ భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా (జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌) ఉంది. ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. అలాగే మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్తుంటారు కదా? అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారు. మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్‌ చేసుకుని ఇక్కడ ఓటు నమోదు చేసుకోండి. మీరు కూడా మా వాళ్లే. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆంధ్రావోళ్లు తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోండి’ అని చెప్పుకొచ్చారు హరీశ్‌ రావు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens